అచ్చమైన తెలుగు టైటిల్‌తో వస్తున్న ‘సందిగ్ధం’.. ప్రీ రిలీజ్ వేడుకలో తమ్మారెడ్డి

అచ్చమైన తెలుగు టైటిల్‌తో వస్తున్న ‘సందిగ్ధం’.. ప్రీ రిలీజ్ వేడుకలో తమ్మారెడ్డి

Published on May 27, 2026 8:11 AM IST

Sandigdham Telugu Movie

తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వం వహించిన చిత్రం ‘సందిగ్ధం’. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. సినిమాకు అచ్చమైన తెలుగు టైటిల్ పెట్టడాన్ని అభినందించారు. అడవుల్లో ఎంతో కష్టపడి చిత్రాన్ని రూపొందించారని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోందన్నారు. చిన్న సినిమాల గురించి ప్రేక్షకులకు తెలిసేలా అందరూ బాధ్యతగా ప్రమోట్ చేయాలని, ఈ చిత్రం విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

అడవుల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు పార్థసారధి, ఇతర నటీనటులు తెలిపారు. చిన్న సినిమాలను విడుదల చేయడం, ప్రమోట్ చేయడం కష్టంతో కూడుకున్న పనని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఈ చిత్రంలో నవీన్ సంకరపు ప్రతినాయకుడిగా నటించగా, గౌతమ్ రవిరామ్ సంగీతం అందించారు. నందన్ కృష్ణ కెమెరామెన్‌గా పనిచేశారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు