ఇంటర్వ్యూ: అమైరా దస్తూర్ – సంజన చాలా స్మార్ట్ డైరెక్టర్ !

ఇంటర్వ్యూ: అమైరా దస్తూర్ – సంజన చాలా స్మార్ట్ డైరెక్టర్ !

Published on May 31, 2018 3:37 PM IST

రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాజుగాడు’. ఈ సినిమా రేపు 1వ తేదీన విడుదలకానుంది. ఈ సందర్బంగా అమైరా దస్తూర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
ఫస్టాఫ్లో పక్క హైదరాబాదీ అమ్మాయిలా కనిపిస్తాను. సెకండాఫ్లో విలేజ్ అమ్మాయిలా, సాంప్రదాయ దుస్తుల్లో ట్రెడిషనల్ గా ఉంటాను.

ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది ?
డైరెక్టర్ సంజన నేను చేసిన ‘అనేగన్’ సినిమా చూసి 2016లో నాకు ఫోన్ చేసి సినిమా చేస్తున్నాను నటిస్తారా అని అడిగారు. వాస్తవానికి ఇదే నా మొదటి సినిమా. కానీ షూట్ ఆలస్యం అవడం వలన ఇది నా రెండో సినిమా అయింది.

రాజ్ తరుణ్ తో వర్క్ చేత్యడం ఎలా ఉంది ?
రాజ్ నాకన్నా ఒక సంవత్సరం మాత్రమే పెద్ద. ఇద్దరి అభిరుచులు ఒకటే. షూటింగ్స్ లో ఉన్నా బయట ఉన్న ఒకేలా సరదాగా ఉంటాడు.

మీ దర్శకురాలి గురించి చెప్పండి ?
నిజంగా సంజన అద్భుతం. చాలా స్మార్ట్. తనకేం కావాలో తనకు బాగా తెలుసు. ఆమెతో పనిచేస్తే ఒక ఫ్యామిలీతో వర్క్ చేస్తున్నట్టు అనిపించింది.

‘ప్రస్థానం’ రీమేక్ గురించి చెప్పండి ?
జూన్ లో మొదలుపెడుతున్నాం. ఇంకా సంజయ్ సర్ ని కలవలేదు. డైరెక్టర్ దేవా మొత్తం స్టోరీ చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది ఆ సినిమా చేయడం.

2018 మీకు లక్కీ అని చెప్పొచ్చా ?
అవును లక్కీ. దేవ, ప్రకాష్ కోవెలమూడి లాంటి ఇద్దరు సౌత్ దర్శకులతో పనిచేస్తున్నాను. నిజంగా ఇది నాకు మంచి టైమ్.

మీకు డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా ?
నాకు ‘పద్మావత్’ లాంటి సినిమా చేయాలని ఉంది. సంజయ్ లీలా బన్సాలి నాకు ఫేవరెట్ డైరెక్టర్. పిరియాడికల్ ఫిలిమ్స్ చేయాలనేది నా కోరిక.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు