సంజయ్ దత్ నన్ను స్వయంగా అప్రోచ్ అయ్యాడు – దేవ కట్ట

సంజయ్ దత్ నన్ను స్వయంగా అప్రోచ్ అయ్యాడు – దేవ కట్ట

Published on May 25, 2018 2:12 PM IST

దర్శకుడు దేవ కట్ట డైరెక్ట్ చేసిన చిత్రం ‘ప్రస్థానం’ ఆయనకు ఎంతటి పేరుని తెచ్చి పెట్టిందో తెలిసిన సంగతే. ఇప్పుడీ సినిమా హిందీలోకి రీమేక్ కానుంది. ఇందులో ప్రధానమైన సాయి కుమార్ పాత్రను సంజయ్ దత్ పోషించనున్నారు. అంతేగాక ఆయనే సినిమాను నిర్మించనున్నారు కూడ. ఈ వార్త బయటకు రాగానే అసలు సంజయ్ దత్ లాంటి హీరోతో సినిమా చేసే అవకాశం దేవ కట్టకు ఎలా వచ్చింది అనే ప్రశ్న చాలా మందిలో మొదలైంది.

ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ సినిమా కోసం సంజయ్ దత్ తనను స్వయంగా అప్రోచ్ అయ్యారని అన్నారు దేవ. 2011లో సినిమా చూసిన సంజయ్ హిందీలో కూడ చేయాలని అన్నారు. నేను కూడ ఒప్పుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూ ఉండగా ఆయన వ్యక్తిగత సమస్యల వలన జైలుకెళ్లడం జరిగింది. దాంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. కానీ సంజయ్ మాత్రం ఇచ్చిన మాట మర్చిపోలేదు. అన్ని సమస్యల నుండి బయటపడ్డాక తిరిగి సినిమా చేద్దామన్నారని తెలిపారు.

జూన్ 1వ తేదీన ఈ చిత్రం ముంబైలో మొదలుకానుంది. యువ హీరో అలీ ఫజల్ ఇందులో కీలక పాత్ర చేయనుండగా అమైరా దస్తూర్ కథానాయిక పాత్రను పోషించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు