హీరమండి కోసం నెట్ ఫ్లిక్స్ తో చేతులు కలిపిన సంజయ్ లీలా భన్సాలీ!

Published on Aug 10, 2021 12:16 pm IST


సంజయ్ లీలా భన్సాలీ మొట్ట మొదటి సారిగా తీస్తున్న హీరమండి వెబ్ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సంజయ్ లీలా భన్సాలీ గంగుభాయ కథియవాడి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం ఈ వెబ్ సిరీస్ కోసం పని చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను మరింత అత్యుత్తమం గా నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. అందుకోసం హీరమండి ను నెట్ ఫ్లిక్స్ తో కలిసి నిర్మించనున్నారు. ఈ వెబ్ సీరీస్ ఇక నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఈ వెబ్ సిరీస్ స్వాతంత్ర్య రాకముందు జరిగిన సంఘటన ల ఆధారంగా ఉండనుంది. భారత్ మరియు పాకిస్తాన్ వీడిపొక ముందు హీరమంది లాహోర్ లో ఉండగా, ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ వెబ్ సిరీస్ లో సొనాక్షి సిన్హా, రిచా చద్దా, హూమా ఖురేషీ లతో పాటుగా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :