బాహుబలి 2 రికార్డును క్రాస్ చేయలేకపోయిన సంజు !

Published on Jul 6, 2018 12:30 pm IST


రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవిత కథతో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సంజు’. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది . ఈచిత్రం వారం రోజుల్లో రూ. 202. 51కోట్ల వసూళ్లను సాధించి ‘3ఇడియట్స్’ చిత్ర రికార్డు ను క్రాస్ చేసింది. ఇంతకుముందు ఆ చిత్రం రూ. 202.47కోట్లు కలెక్ట్ చేసింది.

అయితే హిందీలో మంచి వసూళ్లతో దూసుకెళ్తున్నసంజు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి2’ చిత్ర కలెక్షన్స్ ను మాత్రం క్రాస్ చేయలేకపోయింది. బాహుబలి 2 అక్కడ వారం రోజుల్లో 247 కోట్ల వసూళ్లను రాబట్టి బెంచ్ మార్క్ ను సెట్ చేసింది . ఇప్పటివరకు విడుదలైన ఏ హిందీ చిత్రం కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోవడం విశేషం.

సంబంధిత సమాచారం :