ఆసక్తి రేకెత్తిస్తున్న “గూడుపుఠాణి” ట్రైలర్..!

Published on Sep 16, 2021 3:00 am IST


నవ్వుల రారాజు సప్తగిరి కమెడీయన్‌గా పరిచయమై ఆ తర్వాత హీరోగా మారాడు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, ‘సప్తగిరి ఎల్ఎల్‌బీ’ అనే సినిమాల్లో సప్తగిరి హీరోగా నటించినా ఈ సినిమాలు కామెడీ జానర్‌లోనే తెరకెక్కించడంతో సప్తగిరి ఫేట్ కమెడీయన్‌గా ఉండిపోయింది తప్పా హీరోయిజానికి మారలేదు. అయితే సప్తగిరి తాజాగా కే.ఎం.కుమార్ దర్శకత్వంలో “గూడుపుఠాణి” సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా సప్తగిరి ఫేట్ హీరోగా మారబోతుందేమోనని అనిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది. చక్కటి ప్రేమ కథతో మొదలైన ఈ ట్రైలర్ యాక్షన్ సన్నివేశాలతో ముగిసింది. సంగీత దర్శకుడు రఘుకుంచె ఈ సినిమాలో విలన్‌గా చాలా చక్కగా నటించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.ఆర్‌. ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీనివాసరెడ్డి, రమేశ్‌ యాదవ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :