‘అష్టా చమ్మా’, ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ లాంటి పలు విజయవంతమైన సినిమాలతో నటిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతి, తాజాగా ‘త్రిపుర’ అనే సినిమాతో మనముందుకు రానున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాకు రాజ్ కిరణ్ దర్శకుడు. రాజ్ కిరణ్, తన మొదటి సినిమా ‘గీతాంజలి’ తరహాలోనే ఈ సినిమాను కూడా హర్రర్ కామెడీ జానర్లోనే తెరకెక్కించారు. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ నెలలో విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు ప్రస్తుతం సూపర్ క్రేజ్ ఉన్న కమెడియన్ సప్తగిరి రోల్ మేజర్ హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. ‘త్రిపుర’ సినిమా గురించి సినిమా యూనిట్ తెలిపిన దాని ప్రకారం, సప్తగిరి రోల్ సినిమా మొత్తం ఉండనుందని తెలుస్తోంది. సప్తగిరి రోల్ సినిమా మొత్తం కడుపుబ్బా నవ్విస్తుందని సినిమా యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా స్వాతి పాత్రకు పెళ్ళి కాకుండా సప్తగిరి పలు ప్రయత్నాలు చేస్తూ నవ్విస్తారని సమాచారం. ఏ. చినబాబు, ఎం. రాజశేఖర్‌లు క్రేజీ మూవీస్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు.
