విజయ్ దేవరకొండ తో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ!

Published on Dec 10, 2021 7:30 pm IST


అర్జున్ రెడ్డి చిత్రం తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసారు విజయ్ దేవరకొండ. ఈ చిత్రం తో యూత్ లో విజయ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతేకాక వరుసగా చేస్తున్న సినిమాలు, స్టైల్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయారు విజయ్. విజయ్ దేవరకొండ తో నటించేందుకు సిద్దంగా ఉన్నాం అంటూ ఇప్పటికే చాలామంది చెప్పుకొచ్చారు. తాజాగా మరొక బాలీవుడ్ భామ విజయ్ తో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది.

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ కొత్త చిత్రం అత్రంగి రే డిసెంబర్ 24 వ తేదీన డైరెక్ట్ డిజిటల్ గా విడుదల కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో మీడియా తో రాపిడ్ ఫైర్ ప్రశ్నల సెషన్ లో పాల్గొనడం జరిగింది. ఇందులో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి మాట్లాడటం విశేషం.

ఏ దక్షిణాది నటుడు తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు అని అడగగా, విజయ్ దేవరకొండ తో నటించడానికి రెడీ అన్నట్లు తెలిపారు. విజయ్ చాలా కూల్ అని, హాట్ అంటూ చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ అయిన లైగర్ చిత్రం లో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :