భాగి 3 లో యువ హీరోయిన్ ?

భాగి 3 లో యువ హీరోయిన్ ?

Published on Dec 18, 2018 1:40 PM IST

‘కేదర్నాథ్’ చిత్రం తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ యువ హీరోయిన్ సారా అలీ ఖాన్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద పర్వాలేదనిపిస్తుంది. ఈ చిత్రం తరువాత సారా, రణ్వీర్ సింగ్ కు జోడిగా టెంపర్ హిందీ రీమేక్ ‘సింబా’ లో నటించింది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 28న విడుదలకు సిద్దమైంది. ఇక తాజాగా సారాకు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు సాజిద్ నడియద్వాలా ‘భాగి 3’ లో సారా ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తర్వలోనే క్లారిటీ రానుంది.

టైగర్ ష్రాఫ్ నటించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. మరి ఈ చిత్రమైన ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి. ఇంతకుముందు భాగి , భాగి 2 చిత్రాల్లో టైగర్ ష్రాఫ్ కి జోడిగా శ్రద్దా కపూర్, దిశా పటాని నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు