సాయి పల్లవి పేరట మరో రికార్డు !

Published on May 24, 2021 1:32 pm IST

అక్కినేని యువ హీరో నాగ చైతన్య హీరోగా క్రేజీ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సాయి పల్లవి డ్యాన్స్ పుణ్యమా అని ఈ సినిమాలోని సారంగదరియా పాట తాజాగా యూట్యూబ్‌లో 200 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. సుద్దాల అశోక్‌ తేజ రాసిన ఈ పాటను మంగ్లీ ముగ్ధ మనోహరంగా ఆలపించింది. ఫిబ్రవరి 28న రిలీజైన ఈ పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు సాధించి ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని బుట్టబొమ్మ, రాములో రాములా పాటల పేరిట ఉన్న రికార్డులను తిరగరాసింది.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడ విడుదల చేయనున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య వర్క్ చేయడం ఇదే మొదటిసారి కావడంతో, సాయి పల్లవి, నాగ చైతన్య ఫస్ట్ టైమ్ కలిసి వర్క్ చేయడంతో సినిమా ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ మూవీలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :