సాప్ట్ వేర్ ఇంజినీర్ అనీల్ పంగులూరి దర్శకత్వం లో తెరకెక్కిన క్షీర సాగర మథనం చిత్రం ఘన విజయం సాధిస్తుందని ప్రముఖ నిర్మాత శరత్ మరార్ అన్నారు. అయితే ఈ చిత్రాన్ని తను చూసినట్లు తెలిపారు. అనీల్ పంగులూరి కి ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. ఈ మేరకు శరత్ మరార్ క్షీర సాగర మథనం ట్రైలర్ ను విడుదల చేసారు. అయితే ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్ట్ 6 వ తేదీన విడుదల కి సిద్దం అయింది. మానస్ నాగులపల్లి, బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ లు హీరో లుగా, అక్షత సోనావని హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ వేంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.
అయితే ఈ చిత్రం దర్శకుడు అనిల్ పంగలూరి మాట్లాడుతూ, తమ చిత్రానికి మోరల్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్న శరత్ మరార్ గారికి రుణపడి ఉంటాం అని అన్నారు.ఆయన చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆగస్ట్ 6 వ తేదీన చిత్రాన్ని థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.


