యూఎస్ లో మహేష్,బన్నీ ఎంత వసూలు చేశారంటే..?

Published on Jan 15, 2020 5:02 pm IST

సంక్రాంతి చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో యూఎస్ బాక్సాపీస్ వద్ద స్థిరమైన వసూళ్లు సాధిస్తూ ముందుకు వెళుతున్నాయి. నిన్న మంగళ వారం కూడా ఈ రెండు చిత్రాలు చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టాయి. సరిలేరు నీకెవ్వరు మూవీ భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6:15 నిమిషాల వరకు 200 లొకేషన్స్ నుండి $91,700 డాలర్స్ వసూలు చేసింది. దీనితో సరిలేరు నీకెవ్వరు యూఎస్ బాక్సాపీస్ కలెక్షన్స్ $1.77 మిలియన్ డాలర్స్ కి చేరుకున్నాయి. ఈ వారాంతానికి ఈ చిత్రం $2 మిలియన్ మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక అల వైకుంఠపురంలో మరింత మెరుగైన కలెక్షన్స్ రాబడుతుంది. మంగళ వారం అదే సమయానికి ఈ చిత్రం $1,70,200 డాలర్స్ 122 లొకేషన్స్ నుండి రాబట్టింది. మహేష్ మూవీతో పోల్చుకుంటే ఇవి దాదాపు రెట్టింపు వసూళ్లు అని చెప్పాలి. ఇక అల వైకుంఠపురంలో బాక్సాపీస్ కలెక్షన్స్ $1.74 మిలియన్ డాలర్స్ కి చేరాయి. బన్నీ ఊపు చూస్తుంటే చాలా వేగంగా $2 మిలియన్ మార్కు చేరుకునేలా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :

X
More