మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’

Published on Jul 19, 2019 5:54 pm IST

అనిల్ రావిపూడి, మహేష్ బాబుల కానుకలో మొదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ షూటింగ్ మొదటి షెడ్యూల్ ఈరోజే ముగిసింది. ఈ విషయాన్నే తెలుపుతూ మహేష్ బాబుగారితో వర్క్ చేయడం చాలా గొప్పగా ఉందని అనిల్ రావిపూడి ఎగ్జైట్ అవుతూ చెప్పారు.

ఇక రెండవ షెడ్యూల్ ఈ నెల 26 నుండి హైదరాబాద్ సిటీలో జరగనుంది. నగరంలో సినిమా కోసం ప్రత్యేకమైన సెట్ నిర్మించారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కథానాయకిగా రష్మిక మందన్న నటిస్తోంది. మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :