యూట్యూబ్‌లోకి మహేశ్ “కొండారెడ్డి బురుజు” ఫైట్..!

Published on Jul 9, 2021 2:02 am IST

గత ఏడాది సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న “సర్కార్ వారి పాట” వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ రెండు సినిమాల మధ్య చాలా గ్యాప్ రావడం, ఏడాదిన్నర కాలంగా మహేశ్ బాబు సినిమాలకు సంబంధించి పెద్దగా అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు ఈ విషయంలో చాలా డిసప్పాయింట్ అవుతున్నట్టు తెలుస్తుంది.

అయితే మహేశ్ సినిమాల గురుంచి ఎలాంటి అప్డేట్స్ లేక డిసప్పాయింట్ అవుతున్న అభిమానులకు అమెజాన్‌ ప్రైమ్‌ కాస్త రిలీఫ్‌ను చేకూర్చే ప్రయత్నం చేసింది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో బాగా పాపులర్‌ అయిన ‘కొండారెడ్డి బురుజు’ ఫైట్‌ సన్నివేశాన్ని తాజాగా యూట్యూబ్‌లో పంచుకుంటూ మహేశ్‌బాబు ఎక్కడా తగ్గరు అంటూ రాసుకొచ్చింది. అయితే మీరు ఈ ఫైట్‌ను సినిమాలో చూసినప్పటికి మళ్ళీ ఒకసారి యూట్యూబ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.

సంబంధిత సమాచారం :