నెల్లూర్ సిటీలో మహేష్ కొత్త రికార్డ్

Published on Jan 10, 2020 9:34 pm IST

ఈ సంక్రాంతి సీజన్లోని పెద్ద సినిమాల్లో ఒకటైన ‘సరిలేర నీకెవ్వరు’ చిత్రం రేపు 11వ తేదీన విడుదలకానున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. రేపు విడుదలవుతున్న ఏకైక సోలో తెలుగు చిత్రం కావడంతో ఎక్కువ సంఖ్యలోని థియేటర్లలో ఈ చిత్రమే ప్రదర్శితం కానుంది.

సాధారణంగానే నెల్లూర్ సిటీలో మహేష్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. పైగా అక్కడ మల్టీ ప్లెక్స్ థియేటర్లు పెరగడంతో స్క్రీన్ల కౌంట్ కూడా బాగా పెరిగింది. దీంతో సిటీలో తొలిరోజు ఏకంగా 82 షోలు పడనున్నాయి. ఇప్పటి వరకు ఏ సినిమాకు మొదటి రోజు ఈ స్థాయిలో షోలు వేయడం జరగలేదు. పైగా
అన్ని షోలు దాదాపు ఫుల్ అవడం విశేషం.
దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :