2020 ఆరంభంలో విడుదలకానున్న తెలుగు సినిమాల్లో మహేష్ బాబు యొక్క ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా ఒకటి. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కూడా ఇదే. అవును ఐఎండీబీ నిర్వహించే మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాలో ఈ చిత్రం మొదటి స్థానంలో ఉంది.
ఈ జాబితాను చూజ్ చేసుకున్న ప్రేక్షకుల్లో దాదాపు 40 శాతం మంది ప్రేక్షకులు తాము ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నట్టు ఓటింగ్ చేశారు. అలాగే జాబితాలో సల్మాన్ ఖాన్ యొక్క ‘దబాంగ్ 3’ రెండవ స్థానంలో ఉంది. దీన్నిబట్టి మహేష్ సినిమాకున్న డిమాండ్ ఎలాంటిదో అర్థమవుతోంది. ఈ డిమాండ్ మూలంగానే సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ సైతం భారీస్థాయిలో జరిగింది.
అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు. రష్మిక మందన్న ఇందులో కథానాయికగా నటిస్తోంది. జనవరి 11న చిత్రం భారీ ఎత్తున విడుదలకానుంది.


