‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్ ఈవెంట్ డీటైల్స్

Published on Dec 15, 2019 3:05 pm IST

‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ప్రమోషన్లు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ రిలీజ్ చేసి బ్రహ్మండమైన కిక్ స్టార్ట్ ఇచ్చిన మహేష్ బృందం ఇకపై ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. ఒక్కో పాటను విడుదల చేస్తూ వచ్చిన టీమ్ ఇప్పుడు ప్రీరిలీజ్ వేడుకకు సిద్దమైంది. జనవరి 5వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు టీమ్.

మహేష్ గత సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్నీ భారీగా జరిగాయి. వేల సంఖ్యలో ఫ్యాన్స్ హాజరయ్యారు. కాబట్టి ఈ వేడుకకు కూడా పెద్ద ఎత్తున అభిమానులు హాజరవుతారు. ఇక సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని, జనవరి 11నాడే చిత్రం విడుదలవుతుందని నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు. రష్మిక మందన్న ఇందులో కథానాయికగా నటిస్తోంది. అలాగే సీనియర్ నటి విజయశాంతి ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More