వరల్డ్ వైడ్ గా వారంలో 100 కోట్ల షేర్ దాటేసిన మహేష్

Published on Jan 18, 2020 3:58 pm IST

మహేష్ సరిలేరు నీకెవ్వరు వరల్డ్ వైడ్ గా వంద కోట్ల మార్కుని దాటివేసింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లో మొదటివారానికి 85.56 కోట్ల షేర్ రాబట్టింది. ఇక కర్ణాటకలో 6.4 కోట్లు తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2.7 కోట్లు, యూఎస్/కెనడా లలో 8.1 కోట్లు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో కలిపి 1 కోటి, ఇక రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 1.8 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు సాధించిన షేర్ 105.56 కోట్లు. ఈ మొత్తం మొదటి వారానికి గాను నాన్ బాహుబలి రికార్డ్ కావడం విశేషం.

ఇక నేడు, రేపు కూడా వారాంతపు సెలవు దినాలు కావడంతో ఈ చిత్ర వసూళ్లు మెరుగ్గానే ఉండే అవకాశం కలదు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా మహేష్ కి జంటగా రష్మిక మొదటిసారి నటించింది. ఇక సూపర్ స్టార్ విజయశాంతి చాలా కాలం తరువాత ఓ కీలక రోల్ చేశారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More