మేజర్ అజయ్ కృష్ణ గెటప్ లో మహేష్…!

Published on Aug 9, 2019 10:01 am IST

తన జన్మదినాన్ని పురస్కరించుకొని మహేష్ ఫ్యాన్స్ కి తనదైన రీతిలో మంచి ట్రీట్ ఇచ్చారు. ముందుగా చెప్పిన విధంగా తాను చేస్తున్న తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరూ” చిత్రంలో తన పాత్రను పరిచయం చేస్తూ ఇంట్రడక్షన్ ప్రోమో విడుదల చేయడం జరిగింది. మహేష్ మేజర్ అజయ్ కృష్ణ గా అద్భుతంగా ఉన్నాడు. కాశ్మీర్ షెడ్యూల్ లో చిత్రీకరించిన విజువల్స్ కి దేవిశ్రీ మ్యూజిక్ తోడవ్వడంతో ప్రోమో రిచ్ గా అంచనాలకు తగ్గట్టుగా ఉంది. “సరిలేరు నీకెవ్వరూ.. నువ్వెళ్ళే దారికి జోహారూ…”అని సాగే థీమ్ సాంగ్ గూస్ బమ్స్ కలిగిస్తుంది.

ఒక్క ప్రోమోతోనే మహేష్ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా, విజయశాంతి,రాజేంద్ర ప్రసాద్ వంటి నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 2020 సంక్రాంతికే కానుకగా విడుదల కానుంది.

ప్రోమో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :