యూట్యూబ్ రికార్డు లు దుమ్ముదులుపుతున్న మహేష్.

యూట్యూబ్ రికార్డు లు దుమ్ముదులుపుతున్న మహేష్.

Published on Nov 23, 2019 12:00 PM IST

sarileru 2

నిన్న సాయంత్రం మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ టీజర్ యూట్యూబ్ లో సునామీ సృష్టించింది. విడుదలైన నిమిషాలలో లక్షల్లో వ్యూస్ అండ్ లైక్స్ సాధించి రికార్డుల దుమ్ముదులిపింది. ఫాస్టెస్ట్ వన్ మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్ గా నిలిచిన ఈ టీజర్ ఫాస్టెస్ట్ 10మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్ గా కూడా రికార్డు నమోదు చేసింది. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్నది. మాస్ క్లాస్ కు నచ్చేలా కట్ చేసిన టీజర్ ప్రతి ఒకరిని ఆకర్షించింది.

సరిలేరు నీకెవ్వరూ సినిమా వచ్చే నెల జనవరి 11 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అనిల్ సుంకర, మహేష్ బాబు, దిల్ రాజులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్. విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది సంక్రాంతికి ఎఫ్2 చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు మూవీతో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు