ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో మహేష్ మ్యాజిక్ ఫిగర్ అందుకున్నారు.

Published on Jan 17, 2020 7:00 pm IST

మహేష్ సంక్రాంతి చిత్రం సరిలేరు నీకెవ్వరు ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. ఈ చిత్రం విడుదలైన ఆరు రోజులకు కోటి రూపాయల వసూళ్లకు చేరువైంది. హైదరాబాద్ నగరంలో అతిపెద్ద సినిమా మార్కెట్ గా ఉన్న ఆర్ టి సి క్రాస్ రోడ్స్ నందు మహేష్ మరో మారు తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. సంక్రాంతి పండుగ చివరి రోజైన కనుమ నాడు సరిలేరు నీకెవ్వరు 9,06,781 రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. దీనితో సరిలేరు నీకెవ్వరు ఆరు రోజులలో 99,31,157 రూపాయల గ్రాస్ రాబట్టింది.

ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో అత్యధిక మొదటి వారం కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా మూడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ బాహుబలి 2, సాహో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక నేడు మరియు శని, ఆదివారాలు ఈ చిత్ర వసూళ్లకు కీలకం కానున్నాయి. అందుకే ప్రొమోషన్స్ పై దృష్టిపెట్టారు చిత్ర బృందం. నేటి సాయంత్రం హన్మకొండ వేదికగా విజయోత్సవ వేడుక నిర్వహించనున్న చిత్ర యూనిట్, కొద్దిసేపటి క్రితం మైండ్ బ్లాక్ సాంగ్ ప్రోమో వీడియో విడుదల చేశారు.

సంబంధిత సమాచారం :