యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న మహేష్

Published on Jan 9, 2020 1:42 pm IST

సూపర్ స్టార్ మహేష్ చిత్రాలకు యూఎస్ లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.టాలీవుడ్ నుండి అత్యధిక సార్లు మిలియన్ డాలర్స్ సాధించిన హీరోగా మహేష్ ఉన్నారు. ఇక తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు అడ్వాన్స్ బుకింగ్స్ నందు దూసుకుపోతుంది. ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం సరిలేరు నీకెవ్వరు 4 లక్షల డాలర్ల గ్రాస్ దాటివేసిందట. ప్రీమియర్ కలెక్షన్స్ ద్వారానే సరిలేరు నీకెవ్వరు 1 మిలియన్ డాలర్స్ దాటివేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే ఊపుకొనసాగితే సరిలేరు నీకెవ్వరు మొదటిరోజే 1.5 మిలియన్ కలెక్షన్స్ సాధించడం కష్టమేమి కాదు. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న పక్షంలో వసూళ్ళు మరింత పెరిగే అవకాశం కలదు.

అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు. ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుండగా, విజయ శాంతి ఓ కీలక రోల్ చేస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :