టీజర్ లో రెండు వేరియేషన్స్ లో కేకపుట్టించనున్న మహేష్.

Published on Nov 20, 2019 7:02 am IST

మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ డేట్ వచ్చేసింది. ఈనెల 22న సాయంత్రం 5:04నిమిషాలకు టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. నిన్న విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో బ్లాక్ కలర్ షర్ట్ లో ఉన్న మహేష్ షార్ప్ మరియు ఫెరోషియస్ లుక్ గూస్ బంప్స్ కలిగించేదిలా ఉంది. ఇక టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సరిలేరు నీకెవ్వరు టీజర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ రేంజ్ లో కట్ చేశారట. అటు ఆర్మీ మేజర్ గా, ఇటు సివిలియన్ గా రెండు షేడ్స్ లో మహేష్ ఈ మూవీలో కనిపిస్తాడట. అసలు సరిహద్దులోని సైనికుడు, కర్నూల్ లో ఎందుకు కత్తిపట్టాడు అనేది ఈ మూవీలో ఆసక్తికర అంశం. నిమిషానికి పైగా సాగే టీజర్ లో యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో మహేష్ దుమ్మురేపనున్నాడు.

మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా.. లేడీ అమితాబ్ విజయశాంతి దాదాపు 13ఏళ్ల తరువాత వెండి తెరపై కనిపించనున్నారు. ఆమె భారతి అనే ఓ పవర్ ఫుల్ లేడీ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ దేవిశ్రీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More