యూఎస్ లో మహేష్ మూవీ టికెట్ ధర అంతా?

యూఎస్ లో మహేష్ మూవీ టికెట్ ధర అంతా?

Published on Dec 27, 2019 8:38 AM IST

టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు సినిమాలకు యూఎస్ లో ఉండే క్రేజే వేరు. ఈ హ్యాండ్ సమ్ హీరో చిత్రాలకు అక్కడ ఫుల్ డిమాండ్. ఇప్పటికే అనేక చిత్రాలు మిలియన్స్ డాలర్ల వసూళ్లు సాధించి మహేష్ స్టామినా నిరూపించాయి. ఇక మహేష్ లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు చిత్రం పై కూడా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ సినిమా టికెట్ ధర భారీగా ఉందట. 20 నుండి 21 డాలర్ల వరకు సరిలేరు నీకెవ్వరు టికెట్ ధర నిర్ణయించారని సమాచారం. టాలీవుడ్ నుండి మహేష్ సినిమాలకు యూఎస్ మంచి మార్కెట్ గా తయారైంది.

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మహేష్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుండగా విజయ శాంతి కీలక రోల్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు 2020 జనవరి 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు