బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన సర్కార్ !

Published on Oct 26, 2018 9:04 am IST

ఇళయదళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రానికి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. సౌత్ ఇండస్ట్రీ ద్రుష్టి ని ఆకర్షించిన ఈ చిత్రం నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఇక తమిళనాడు లో ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. రికార్డు స్థాయిలో ఈ చిత్రం అక్కడ 83కోట్లకు అమ్ముడైయింది.

ఈ మొత్తం తమిళ నాడు లో ‘బాహుబలి 2’ ఫుల్ రన్ లో కలెక్ట్ చేసిన షేర్ కంటే ఎక్కువ కావడం విశేషం. మరి సర్కార్ ఈ రేంజ్ లో వసూళ్లు రాబడతాడో లేదో చూడాలి. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :