సంచలనాలు సృష్టిస్తోన్న ‘సర్కార్’ టీజర్ !

Published on Oct 20, 2018 12:15 pm IST

స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘సర్కార్’. కాగా దసరా సందర్భంగా నిన్న సాయంత్రం 6 గంటలకు విడుదలైన ఈ చిత్ర తమిళ వెర్షన్ టీజర్ ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను రాబడుతుంది. కేవలం 17 గంటల్లోనే 13 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఈ ఊపు చూస్తుంటే.. 24 గంటల్లో 20 మిలియన్ వ్యూస్ మైలురాయిని అధిగమించేలా ఉంది.

ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే మల్టీ మిలినియర్ అయిన విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇండియాకి వస్తాడు. కాగా ఆ తరువాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం సాగబోతుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రాదా రవి , వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులముందుకు తీసుకురానుంది. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ టీజర్ ను కూడా అతి త్వరలోనే విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :