ఈ రోజు సర్కార్ తెలుగు ట్రైలర్ విడుదల !

Published on Oct 23, 2018 12:43 pm IST

ఇళయదళపతి విజయ్ నటించిన 62వ చిత్రం ‘సర్కార్’. ఈచిత్రం తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రీకల్ ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నారు. అలాగే ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో జరపడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో అశోక్ వల్లభనేని విడుదల చేస్తున్నారు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6న రెండు భాషల్లో భారీ స్థాయిలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :