సర్కార్ ట్రైలర్ విడుదల లేనట్లే ?

సర్కార్ ట్రైలర్ విడుదల లేనట్లే ?

Published on Oct 23, 2018 12:05 AM IST

ఇళయదళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం యొక్క టీజర్ ఇటీవల విడుదలై యూ ట్యూబ్ ను షేక్ చేసింది. కేవలం మూడు రోజుల్లోనే 2కోట్ల వ్యూస్ ను రాబట్టింది. అలాగే అత్యధిక లైక్స్ ను తెచ్చుకున్న టీజర్ కూడా ఇదే కావడం విశేషం.

అయితే టీజర్ రిలీజ్ అయితేనే ఇంత రెస్పాన్స్ వస్తే ఇక ట్రైలర్ విడుదలైతే మరో సారి యూ ట్యూబ్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదని తెలుస్తుంది. ఈచిత్రం యొక్క ట్రైలర్ విడుదల చేయకుండా దానికి బదులు ప్రోమో సాంగ్స్ ను విడుదల చేయనున్నారట. అలాగే చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 6న తెలుగు , తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు