‘సర్కారు వారి పాట’ సగం అక్కడే

Published on Sep 25, 2020 10:37 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి హిట్ తర్వాత మహేష్ ఎంతో ఆలోచించి సైన్ చేసిన చిత్రమిది. మధ్యలో పలువురు దర్శకులతో పనిచేయాలని అనుకున్నా చివరికి రశురామ్ దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు భారీ పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. లాక్ డౌన్ కారణంగా సినిమా మొదలవడం కాస్త ఆలస్యమైంది కానీ టీమ్ త్వరలో షూట్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే దర్శకుడు పరశురామ్, డీవోపీ, ఆర్ట్ డైరెక్టర్ కలిసి యూఎస్ఏలో లొకేషన్స్ వెతకడానికి వెళ్లారు. కథ ప్రకారం సినిమా అమెరికా నేపథ్యంలో కూడ జరుగుతుందట. సుమారు 50 శాతం చిత్రీకరణ అక్కడే ఉండవచ్చట. మొదటగా అమెరికా షెడ్యూల్ ముగించాలని పరశురామ్ డిసైడ్ అయ్యారు. అది పూర్తయ్యాక హైదరాబాద్ నందు చిత్రీకరణ చేస్తారు. ఈ షూటింగ్లో మహేష్ నవంబర్ నుండి జాయిన్ అవుతారట.

జనవరి నెలాఖరు నాటికి అమెరికా షెడ్యూల్ ముగించాలనేది టీమ్ అలాం అని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లతో కలిసి మహేష్ బాబు స్యయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ జోడీగా కీర్తి సురేష్ నటింస్తుందనే వార్తలు వస్తున్నా ఇంకా ఫైనల్ కన్ఫర్మేషన్ రాలేదు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

సంబంధిత సమాచారం :

More