‘సర్కారు వారి పాట, ‘పుష్ప’ లీకుల పై స్పందన !

Published on Aug 15, 2021 8:08 pm IST

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట, ‘పుష్ప’ సినిమాలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఈ రెండు సినిమాలకు సంబంధించిన కంటెంట్ సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ లీకుల పట్ల మైతీ మూవీ మేకర్స్ స్పందిస్తూ.. ‘మా సినిమాలకు సంబంధించిన కంటెంట్ సోషల్ మీడియాలో లీక్ కావడం మమ్మల్ని బాగా కలచివేసింది.

ఈ లీకులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ లీక్ లకు సంబంధించి ఇప్పటికే ఫిర్యాదు చేశాం’ అని ట్విట్టర్ ద్వారా తెలిపింది. కొందరు ప్రబుద్ధులు తమ కంటెంట్ ను లీక్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు అంటూ.. ఇలాంటి లీకులను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని అంటూ క్లారిటీ ఇచ్చింది.

ఇక భవిష్యత్తులో ఇలాంటి లీక్ లు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా తెలిపింది.

సంబంధిత సమాచారం :