‘సర్కారు’ వచ్చే షెడ్యూల్ గోవాలో !

Published on Apr 25, 2021 6:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా దుబాయ్‌లో షూటింగ్ ‌ను జ‌రుపుకున్న తరువాత హైదరాబాద్ లోనే కొత్త షెడ్యూల్ ను మొదలెట్టి షూట్ చేసింది. కానీ మధ్యలో కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ ను జూన్ నుండి మొదలుపెట్టాలని.. అది ఒక సాంగ్ తో షూట్ ను స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ ఈ సాంగ్ నేపథ్యాన్ని గోవాలో సెలెక్ట్ చేసుకున్నారట.

అందుకే వచ్చే షెడ్యూల్ ను గోవాలో ఫిక్స్ చేశారు. ఇది ఒక స్పెషల్ సాంగ్ అట. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ కూడా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూనే సాగుతోందనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో మంచి యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ట్విస్ట్ లు కూడా ఉన్నాయని.. అలాగే ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని.. మహేష్ అభిమానులకు ఈ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుందట. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :