మహేష్ సర్కారు వారి ట్రీట్ వాయిదా..!

Published on May 27, 2021 7:01 am IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మహేష్ ఫ్యాన్స్ ఎనలేని అంచనాలు పెట్టుకున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి వచ్చే మే 31 సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం సందర్భంగా సాలిడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుందని గత కొన్నాళ్లుగా టాక్ ఉంది.

కానీ లాస్ట్ మినిట్ లో చిత్ర యూనిట్ తమ నిర్ణయం మార్చుకున్నట్టుగా అధికారికంగా ప్రకటన ఇచ్చారు. ఆరోజున ఎలాంటి ఫస్ట్ లుక్ లాంచ్ లేదని ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. అలాగే దీని పట్ల ఎవరూ కూడా ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చెయ్యవద్దని కూడా సూచించారు. అయితే ఇది మాత్రం మహేష్ ఫ్యాన్స్ కి కాస్త చేదు వార్తే అని చెప్పాలి.. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :