సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ “సర్కారు వారి పాట” టీజర్ టైమ్ డ్యూరేషన్ ఫిక్స్!

Published on Aug 8, 2021 10:52 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ ఆగస్ట్ 9 వ తేదీన ఉదయం 9 గంటల 9 నిమిషాలకు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఇప్పటికే సర్కారు వారి పాట చిత్ర యూనిట్ సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరిట పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

సర్కారు వారి పాట టీమ్ సోషల్ మీడియాలో యాక్టిివ్ గా ఉంటూ మహేష్ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న డీటైల్ ను పోస్ట్ చేస్తూ అప్డేట్ పై మరింత ఆసక్తి పెంపొందిస్తుంది. అయితే ఆగస్ట్ 9 న విడుదల కానున్న బర్త్ డే బ్లాస్టర్ వీడియో కి సంబందించిన టైమ్ డూరేషన్ పై ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. 1:17 నిమిషాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 1:17 అంటూ సర్కారు వారి పాట ఇచ్చిన ఈ అప్డేట్ తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబనేషన్ లో వస్తున్న మరొక చిత్రం కి సంబంధించిన అప్డేట్ రేపు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :