జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న “సర్కారు వారి పాట”?

Published on Sep 15, 2021 7:02 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా పరశురాం పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సరికొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా షూట్ జరుగుతుంది అని తెలిసినా ఎంత మేర కంప్లీట్ అయ్యిందో తెలియదు.

కరోనా వల్ల కాస్త లేట్ గానే స్టార్ట్ అయినా ఈ సినిమా షూట్ నిన్న మొన్ననే స్టార్ట్ అయ్యింది కదా ఇంకా చాలా ఉంటుంది అనే భావన చాలా మందిలో ఉండొచ్చు కానీ వాస్తవంగా మాత్రం పెట్లా చాలానే షూట్ కంప్లీట్ చేసేసాడట. ఇంకా వచ్చే రెండు నెలల్లో బహుశా ఆల్ మోస్ట్ షూట్ ని లాస్ట్ స్టేజ్ కి తీసుకు వచ్చేయడం ఖాయం అని తెలుస్తుంది.

పరిస్థితులు బాగుంటే ఎట్టి పరిస్థుతుల్లోని ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలపాలని జెట్ స్పీడ్ లో మేకర్స్ ఈ సినిమాని ఫినిష్ చేస్తున్నారని సమాచారం. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :