లేటెస్ట్..’సర్కారు వారి’ మాస్ ఆల్బమ్ కూడా సోల్డ్ అవుట్.!

Published on Jul 30, 2021 3:14 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” పై ఏ లెవెల్లో పెరుగుతుందో చూస్తూనే ఉన్నాం. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూట్ జరుపుకుంటుండడంతో పాటుగా అదిరే అప్డేట్స్ కూడా ఇస్తూ వస్తున్నారు. మరి నిన్ననే ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ కి ముహూర్తం కన్ఫర్మ్ చెయ్యగా ఈరోజు మేకర్స్ మరో అదిరే అప్డేట్ ను ఇచ్చారు.

మరి దాని ప్రకారం ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ హక్కులు ‘సరిగమ సౌత్’ సొంతం చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అది కూడా భారీ ధరకే ఈ సినిమా హక్కులు అమ్ముడు పోయాయని ఇన్సైడ్ టాక్.. అయితే మహేష్ మరియు థమన్ ల కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన ఏ ఆల్బమ్ కూడా నిరాశపరచలేదు.

ముఖ్యంగా మాస్ నంబర్స్ కి అయితే హైప్ ఇంకో లెవెల్లో ఉంటుంది. అందుకే ఈ ఆల్బమ్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలో పాటలు ఎలా ఉంటాయో చూడాలి. ఇటీవలే మన టాలీవుడ్ నుంచి భారీ చిత్రం “RRR” తర్వాత ఆడియో హక్కులు సోల్డ్ అవుట్ అయ్యింది ఈ సినిమానే మరి ముందు మిగతా భారీ సినిమాల అనౌన్స్మెంట్స్ ఏమన్నా వస్తాయేమో చూడాలి.

సంబంధిత సమాచారం :