సిద్దం అవుతున్న “సర్కారు వారి పాట” టీమ్!

Published on Jul 12, 2021 1:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా పరశురామ్ దర్శకత్వం లో వస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. అయితే ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి మహేష్ అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రం పై ఆసక్తి పెంచుకున్నారు. మహేష్ మాస్ గెటప్ తో వచ్చిన ప్రీ లుక్ అందరినీ కూడా ఆకట్టుకుంది. అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిత్ర యూనిట్ కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోగా అందరికీ కూడా నెగటివ్ అని తేలింది.

అయితే ఈ చిత్రం షూటింగ్ జూలై 12 వ తేదీ నుండి మొదలు కానుంది. వరుసగా మూడు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే యోచన లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సోమవారం నాడు చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో మొదలు కానుంది. అయితే ఆగస్ట్ 9 వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు కావడం తో చిత్ర యూనిట్ అభిమానుల కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా వీడియో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ మొదటి సారి గా హీరోయిన్ పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం కి సంగీతం థమన్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :