సాంగ్ కోసం గోవాకి వెళ్లనున్న ‘సర్కారు’ !

Published on Feb 22, 2021 11:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా గత నెల రోజులుగా దుబాయ్‌లో షూటింగ్ ‌ను జ‌రుపుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. కాగా ఈ షెడ్యూల్ ఆదివారంతో పూర్త‌య్యింది. రీసెంట్ గా కీర్తి సురేష్ కూడా ఈ షెడ్యూల్ షూట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అన్నట్లు త‌దుప‌రి షెడ్యూల్ గోవాలో జ‌ర‌గుతుందని స‌మాచారం. ఈ షెడ్యూల్ లో చిత్రబృందం ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేయడానికి రెడీ అవుతున్నారట.

ఇక ఈ సినిమా కాన్సెప్ట్ కూడా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూనే సాగుతోందనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో మంచి యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ట్విస్ట్ లు కూడా ఉన్నాయని.. అలాగే ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని.. మహేష్ అభిమానులకు ఈ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుందట. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More