సర్కారు వారి పాట: చిన్నపాటి ట్యూన్ వినిపించేసిన తమన్..!

Published on Jan 23, 2022 2:02 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుని సమ్మర్‌కి వాయిదా పడడంతో మహేశ్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే అప్పటివరకు కనీసం మ్యూజికల్ అప్డేట్ అయినా వస్తే బాగుంటుందని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూడగా చివరి నిమిషంలో చిత్రయూనిట్ చేతులెత్తేసింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్డేట్ ఇవ్వలేకపోతోన్నామంటూ క్షమాపణలు చెప్పింది చిత్రయూనిట్. అయితే మ్యూజికల్ ప్రమోషన్స్ ఇంకెప్పుడు మొదలవుతాయా అని వేచి చూస్తున్న అభిమానులను తాజాగా తమన్ మరింత ఊరించేలా చేశాడు. సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ ట్యూన్‌ను కొద్ది సేపు ప్లే చేసి వినిపించాడు. దీంతో త్వరలోనే మహేశ్ టైటిల్ సాంగ్‌కి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తమన్ చెప్పకనే చెప్పాడు.

సంబంధిత సమాచారం :