మరోసారి కరోనా టెస్టుల్లో “సర్కారు వారి” టీం..?

Published on Jul 10, 2021 8:00 am IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సర్కారు వారి పాట” భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇంకొన్ని రోజుల్లో కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేసుకోనున్న సంగతి తెలిసిందే.

అందుకే సన్నాహాలు కూడా ఆల్ మోస్ట్ రెడీ అయ్యిపోయాయి. మరి ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం మేకర్స్ చిత్ర యూనిట్ అంతటికీ మరోసారి కరోనా టెస్టులు చేయించి చేయనున్నట్టు భాగంగా వారి పాట టీం కి కోవిడ్ టెస్టులు నిర్వహించనున్నారట.

ఇక అందరికీ నెగిటివ్ వస్తే పాజిటివ్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా షూట్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ అయ్యిపోనుంది. ఇక ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ కి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ అండ్ 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :