ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చే విధంగా “సర్కారు వారి పాట”.!

Published on Jul 14, 2021 6:48 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. సాలిడ్ అంచనాలు నిలుపుకున్న ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం విషయంలో మాత్రం దర్శకుడు పరశురామ్ పెట్ల ఒక క్లారిటీతో ఉన్నారు. అభిమానులు అంచనాలు ఎక్కడా కూడా తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు.

ఫుల్ మీల్స్ పెట్టే అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయని ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ ఈ చిత్రంలో ఉండే విధంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ మహేష్ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్ లు పై ఒక క్లారిటీ ఉంది వాటికి తోడు మిగతా స్టఫ్ అంతా కూడా ఓ లెవెల్లో పెట్ల ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మరి అభిమానులకు ఫీస్ట్ ఇచ్చే అంశాలు అన్నీ థియేటర్స్ లోనే చూడాలని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :