వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మంచి ఎంటర్టైనర్ “సార్పట్ట”..!

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మంచి ఎంటర్టైనర్ “సార్పట్ట”..!

Published on Jul 9, 2022 3:41 PM IST

గత లాక్ డౌన్ టైం లో ఓటిటి లో చాలానే సినిమాలు రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. వాటిలో ఎన్నో సినిమాలు అద్భుతంగా రాణించాయి కూడా. మరి అలాంటి కొన్ని మంచి ఎంటెర్టైనెర్స్ లో ఒకటైన చిత్రం “సార్పట్ట పరంపర” వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కి సిద్ధంగా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య అలాగే దర్శకుడు పా రంజిత్ కాంబోలో తెరకెక్కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ తరహా సినిమాల్లో ఒక బెస్ట్ సినిమాగా నిలిచి ఆడియెన్స్ ని ఆకట్టుకోగా ఇపుడు తెలుగులో ఈ జూలై 10 మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ మా లో టెలికాస్ట్ కి రెడీగా ఉంది. అప్పుడు చూడకుండా ఉన్నవారు అయినా కూడా మళ్ళీ చూసి ఈ క్లీన్ ఎంటర్టైనర్ ని ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా నీలం ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు