జూలై 13 న విడుదల కానున్న ఆర్య “సార్పట్ట” ట్రైలర్!

Published on Jul 11, 2021 6:09 pm IST

దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సార్పట్ట పరంబరై. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో తమిళ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ఆర్య పోస్టర్లు ఇప్పటికే సినిమా పై ఉన్న ఆసక్తిని మరింత గా పెంచాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల పై ఒక అధికారిక ప్రకటన వచ్చింది.

అమెజాన్ సమర్పణ లో వస్తున్న ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ జూలై 13 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ చిత్రం తమిళ్ తో పాటుగా తెలుగు భాషలో కూడా విడుదల కానుంది. అయితే ఈ చిత్రం జూలై 22 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా డైరెక్ట్ ఓటిటిగా విడుదల కానుంది. ఈ చిత్రంలో దుషర విజయన్, పశుపతి, అనుపమ కుమార్, సంచనా నటరాజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :