ఒకే ప్రొడక్షన్ హౌస్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేయనున్నస్టార్ హీరో !

Published on Jan 3, 2019 9:26 pm IST


తమిళ హీరో ధనుష్ నటించిన ‘మారి 2’ ఇటీవల ప్రేక్షకులముందుకు వచ్చి పర్వాలేదనిపించింది. ఇక ఈచిత్రం తరువాత ఆయన వెట్రిమారన్ దర్శకత్వంలో ‘అసురన్’ అనే చిత్రంలో నటించనున్నాడు. ఈచిత్రాన్ని పూర్తి చేసి ధనుష్ తన 34వ చిత్రాన్ని ‘కోడి’ ఫేమ్ దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో అలాగే 35వ చిత్రాన్ని ‘రట్సాసన్’ ఫేమ్ రామ్ కుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ రెండు చిత్రాలను కూడా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మించనుంది. ఇంతకుముందు ఈసంస్థ నిర్మించిన ‘విశ్వాసం’ జనవరి 10న విడుదలకు సిద్ధమైంది.

ఇక ధనుష్ తను డైరెక్ట్ చేస్తున్న మల్టీ స్టారర్ చిత్రాన్ని పక్కన పెట్టేశాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో అగ్ర హీరో నాగార్జున కూడా నటించాల్సి వుంది. అయితే ఈ చిత్రం ఫై తర్వలోనే క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం :

X
More