బాక్సాఫీస్: ‘రావు బహదూర్’ 2 రోజుల వసూళ్లు ఎంతంటే!

బాక్సాఫీస్: ‘రావు బహదూర్’ 2 రోజుల వసూళ్లు ఎంతంటే!

Published on Jul 5, 2026 2:23 PM IST

మన టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ సత్యదేవ్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్ లో తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ సినిమానే ‘రావు బహదూర్’. రిలీజ్ కి ముందు ఎంతో హైప్ ఇస్తూ థియేటర్స్ లోకి తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ ని అందుకుంది.

అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం డీసెంట్ ఓపెనింగ్స్ తో నిలిచింది. ఇలా రెండు రోజుల రన్ ని ఈ సినిమా కంప్లీట్ చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 6.3 కోట్ల గ్రాస్ ని అందుకుంది స్టడీ డే 2 చూసింది అని చెప్పొచ్చు. ఇక ఈ మూడో రోజు ఆదివారం హాలిడే వసూళ్లు కీలకంగా మారనున్నాయి.

సో ఈరోజు నెంబర్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి స్మరన్ సాయి సంగీతం అందించగా దీపా థామస్ హీరోయిన్ గా నటించారు. అలాగే మహేష్ బాబు చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, ఈశ్వరన్ విజయరాఘవన్ లు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు