మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ఫైనెస్ట్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో సత్యదేవ్ కూడా ఒకరు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘రావు బహదూర్’. తన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య దర్శకుడు వెంకటేష్ మహాతో కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది కావడంతో మంచి బజ్ నెలకొంది.
అయితే ఈ చిత్రం విషయంలో హీరో సహా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చూపిస్తున్న నమ్మకం చూస్తుంటే కంటెంట్ ని వారు ఏ రేంజ్ లో నమ్ముతున్నారో అర్ధం చేసుకోవచ్చు. రావు బహదూర్ సినిమా కోసం గట్టిగా మాట్లాడుకుంటారు అని ఇండియన్ సినిమా అంటే బాహుబలి, RRR అని ఎలా చెప్తారో వాటి తర్వాత రావు బహదూర్ కూడా చెబుతారు అంటూ సత్యదేవ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
నిజానికి ఇది చిన్న స్టేట్మెంట్ అయితే కాదు. కేరాఫ్ కంచరపాలెం తో వెంకటేష్ మహా నుంచి వస్తున్న స్ట్రైట్ సినిమా ఇది. సో ఈసారి కూడా కంటెంట్ పై గట్టి నమ్మకాన్ని వారు పెట్టుకున్నారు. కానీ సడెన్ గా ఈ రేంజ్ స్టేట్మెంట్ అంటే కొందరికి అతి నమ్మకం కూడా అనిపించవచ్చు. సో రావు బహదూర్ నిజంగానే ఆ రేంజ్ లో ఉంటుందా అనేది ఈ జులై 3తో తెలిసిపోతుంది.


