సత్యదేవ్ “తిమ్మరుసు” రిలీజ్ డేట్ ఫిక్స్..!

Published on Jul 8, 2021 6:00 pm IST

సత్యదేవ్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో తన సత్తా చాటుతున్నాడు. వరుస సినిమాలు చేస్తూ తను ఎలాంటి పాత్రనైనా చేయగలను అంటూ నిరూపించుకుంటున్నారు. అయితే సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం తిమ్మరుసు. ఈ చిత్రం లో సత్యదేవ్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన విషయాలను నిర్మాత మహేష్ కోనేరు వెల్లడించారు ఈ మేరకు ఈ చిత్రం విడుదల పై పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

తిమ్మరుసు చిత్రం జూలై 30 వ తేదీన థియేటర్ల లో విడుదల కానుంది అంటూ నిర్మాత చెప్పుకొచ్చారు. అయితే విడుదల తేదీ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం తో అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.శరణ్ కొప్పిషెట్టీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :