సవ్యసాచి ఆ నెలలోనే రానుందా ?

Published on Aug 10, 2018 7:33 pm IST


‘ప్రేమమ్’ చిత్రం తరువాత చందు మొండేటి ,యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ల కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ప్రస్తుతం ఒక్క సాంగ్ చిత్రీకరణ మాత్రమే మిగిలింది. వచ్చే వారంలో ఈ సాంగ్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లానున్నాడు చైతు దాంతో ఈ చిత్రం యొక్క షూటింగ్ పూర్తి కానుంది. ఇక ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు సెప్టెంబర్ రెండవ వారంలో పూర్తి కానున్నాయి. ఆ తరువాత చిత్రాన్ని విడుదలచేద్దామనుకుంటే అదే నెల చివరి వారంలో నాగ్ నటిస్తున్న ‘దేవదాస్’ విడుదలకానుంది. ఇక ఆ తరువాత దసరా బరిలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ తరువాత ‘హలో గురు ప్రేమకోసమే, పందెకోడి 2 ‘చిత్రాలు విడుదలకానున్నాయి.

దాంతో ఇప్పుడు ఏ సినిమాలతో పోటీ లేకుండా నవంబర్ మొదటి వారంలో సవ్యసాచిని సోలోగా విడుదల చేయాలని భావిస్తున్నారట చిత్ర నిర్మాతలు. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా గ్రాఫిక్స్ పనుల కారణంగా వాయిదా పడింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సీనియర్ నటులు మాధవన్ , భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More