ఆ సినిమా దెబ్బకి థియేటర్లు స్కూల్స్ లా మారిపోయాయి.

Published on Jul 14, 2019 5:15 pm IST

గణిత శాస్త్ర మేధావి ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన “సూపర్ 30”. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మధ్యతరగతి వర్గానికి చెందిన మ్యాథ్స్ టీచర్ ఆనంద్ కుమార్ పేదలైన అతిసామాన్య విద్యార్థులను తన ప్రతిభతో ఎలా తీర్చిదిద్దాడు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం హృతిక్ అద్భుతమైన నటనకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

ఐతే నేడు “సూపర్ 30” చిత్రాన్ని చూడడానికి దేశంలోని కొన్ని ప్రధాన నగరాలలో స్కూల్ విద్యార్థులు ఐనాక్స్ దియేటర్లకు వెళ్లి సినిమాను చూశారు. ఈవిషయాన్ని హృతిక్ ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. కలకత్తా,ముంబై,పూణే,ఢిల్లీ వంటి నగరాలలో కొన్ని స్కూల్ యాజమాన్యాలు స్వచ్చంధంగా తమ విధ్యార్ధులను ఈ మూవీ థియేటర్లకు తీసుకెళుతున్నారు. ఇలాంటి చిత్రాలు పిల్లలలో స్ఫూర్తి నింపి వారు చదువుపై శ్రద్ధపెట్టేలా చేస్తాయని వారు భావిస్తున్నారు.

100 కమర్షియల్ హిట్స్ అందుకోవడం కంటే ఇలాంటి ఓ స్ఫూర్తి దాయకమైన సినిమాలో నటించడం అనేది జీవితానికి సార్ధకం చేకూరుస్తుంది.అంత పెద్ద స్టార్ హోదా పెట్టుకొని ఇలాంటి చిత్రంలో నటించిన హృతిక్ ని ఎంత పొగిడినా తక్కువే.

సంబంధిత సమాచారం :

X
More