నా కేరాఫ్ నేను మాత్రమే…నాకెక్కడా బ్రాంచీల్లేవు – లక్ష్మీ భూపాల

Published on Jul 9, 2021 8:34 pm IST

తెలుగు సినీ పరిశ్రమలో స్క్రీన్ రైటర్ గా ఉన్న లక్ష్మీ భూపాల అందరికీ సుపరిచితులే. అయితే ఈ మేరకు తను సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేశారు. దర్శక నిర్మాతల్లారా, నా దగ్గర అసిస్టెంట్ రచయిత గా పని చేశానని, నాకే తెలీకుండా నా దగ్గర ఘోస్ట్ రైటర్ గా పని చేశానని ఈ మధ్య కొందరు మార్కెట్ లో సిగ్గు లేకుండా నా పేరు విచ్చల విడిగా వాడేస్తున్నట్లు తెలిసింది అని చెప్పుకొచ్చారు. అయితే ఇది మొదటి సారి కాదు అని, వాళ్ళని నిలువునా తోలు తీసి ఉప్పూ కారం రాసే మంచితనం నా దగ్గరున్నా నన్నెవరూ నిజానిజాలు అడగలేదు కాబట్టి నేను కూడా చెప్పలేదు అని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఏకంగా నా అసిస్టెంట్ అని చెప్పుకుంటూ కొందరు కొన్ని చోట్ల అడ్వాన్స్ లు కూడా తీసుకున్నారు అని తెలిసింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే వాడేలా రాస్తాడో చూడాలిగానీ, అలా చెప్తే ఎలా డబ్బులిచ్చారు అని అడిగితే మీ దగ్గర పని చేశాడన్న నమ్మకం అంటూ తెలిపిన మాటలను లక్ష్మీ భూపాల వెల్లడించారు.

అయితే అలా అనడం చాలా పెద్ద తిట్టు నాకు అంటూ చెప్పుకొచ్చారు.కాబట్టి ఇప్పుడు తప్పడం లేదు అని అన్నారు. అయితే తను సినిమాల్లో మాటలు, పాటలు రాయడానికి ఇప్పటి వరకూ కేవలం బుర్రను తప్ప ఇంకెవరి సహాయం తీసుకోలేదు అని అన్నారు. అయితే ఒక్క అసిస్టెంట్ కుదన్లేదు అని, ఇక ముందు కూడా ఆ అవసరం లేదు అని తెలిపారు. ఎందుకంటే నిర్మాత, దర్శకుడు నన్ను, జా బుర్రను నమ్మి డబ్బులిస్తారనీ నేను నమ్ముతాను కాబట్టి, అసిస్టెంట్ లను పెట్టుకొనే ఇతర రచయితల ఇబ్బందులు నాకు తెలీదు కాబట్టి వారి విషయం లో నేను మాట్లాడలేను అంటూ చెప్పుకొచ్చారు.

అయితే చివరగా తన పేరు వాడుకుంటున్న దరిద్రులకు ప్రేమగా క్క అభ్యర్థన అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. అమ్మలారా, అయ్యలారా, ఇకముందు మీరు ఇలాంటి మోసాలు, కక్కుర్తి ఎదవ పనుల కోసం నా పేరు వాడినట్టు నాకు తెలిస్తే మీ తల్లిదండ్రుల, మీ భార్యాబిడ్డల, మీ స్నేహితుల చెప్పులతో కొట్టించి లైవ్ పెట్టించి మరీ సన్మానించబడును అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నీ స్వార్థం కోసం పక్కోడి పేరు ను వాడుకోవడం కంటే అంగమార్పిడి చేయించుకోవడం మంచిది అంటూ చెప్పుకొచ్చారు. అయితే అలాంటి వారిని నమ్మకండి, ఎందుకంటే నా కేరాఫ్ నేను మాత్రమే అని, నాకెక్కడా బ్రాంచీల్లేవ్ అని తెలిపారు.

సంబంధిత సమాచారం :