హిందీలో విజయ్ “బీస్ట్” కి స్క్రీన్స్ లాక్..ఎన్ని దక్కాయంటే.!

Published on Apr 5, 2022 10:55 am IST


కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ థలపతి విజయ్ జోసెఫ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడ్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రం “బీస్ట్”. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమాని మేకర్స్ ఇప్పుడు మరికొన్ని రోజుల్లో థియేటర్స్ కి తీసుకురాబోతున్నారు.

అయితే ఈ సినిమాని దక్షిణాది భాషల్లో “బీస్ట్” గానే తీసుకొస్తుండగా ఒక్క హిందీలో మాత్రం “రా” అనే టైటిల్ తో తీసుకొస్తున్నారు. మరి అక్కడ భారీ పోటీతోనే ఈ సినిమా వస్తుండగా ఇప్పుడు ఈ సినిమాకి ఎన్ని స్క్రీన్స్ దక్కాయో తెలుస్తుంది.

ఈ సినిమాకి గాను మినిమమ్ 600 స్క్రీన్స్ కాగా మ్యాగ్జిమమ్ గా 700 స్క్రీన్స్ దక్కినట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో హిందీలో విజయ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందివ్వగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం అందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :